: చిన్నారి శ్రియ హత్యాకేసు నిందితులకు జీవిత ఖైదు
ఆరేళ్ల చిన్నారి శ్రియను అపహరించి, హత్య చేసిన నిందితులకు మహబూబ్ నగర్ న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న చిన్నారి శ్రియను దుండగులు అపహరించిన ఘటన సంచలనం సృష్టించింది. మరుసటి రోజే చిన్నారి పోల్కంపల్లి బావిలో శవమై తేలింది. దీంతో అపహరణ, హత్యకేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ తో పాటు మహ్మద్ నసీమ్, సయ్యద్ అమీర్ లకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.