: భారత్ తో పాక్ బలమైన సంబంధాన్ని కోరుకుంటోంది: షరీఫ్
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ శాంతికోసం తమ దేశం పాకులాడుతుందని కొన్నిరోజుల నుంచి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో షరీఫ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యతో సహా అన్ని విషయాల్లో తమ ప్రభుత్వం భారత్ తో బలమైన సంబంధాన్ని కోరుకుంటుందని పేర్కొన్నారు. రెండు దేశాలు రక్షణపై ఎక్కువ మొత్తాన్ని వ్యయం చేస్తున్నాయన్న షరీఫ్, రెండు దేశాల మధ్య శాంతి నెలకోల్పేందుకు తాను కీలక పాత్ర వహిస్తుండటం చాలా గర్వంగా ఉందని 'వాల్ స్ట్రీట్ జర్నల్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వచ్చే ఆదివారం న్యూయార్క్ లో ఇరు దేశాల ప్రధానులు సమావేశం కానున్నారు. భారత వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు పాక్ కాల్పుల ఉల్లంఘన, కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.