: జమ్మూలో ఉగ్ర దాడి మేమే చేశాం : షోహద బ్రిగేడ్
నిన్న జమ్మూ కాశ్మీర్ లోని కథువా, సాంబ జిల్లాల్లో జరిగిన తీవ్రవాద దాడులు తామే చేశామని ఉగ్రవాద సంస్థ 'షోహద బ్రిగేడ్' ప్రకటించింది. ఈ సంస్థ ప్రతినిధి 'సమి-ఉల్-హక్' ఈ మేరకు ఫోన్ ద్వారా మీడియాకు సమాచారమిచ్చాడు. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ముజాహిదీన్ లు స్థానికులేనని తెలిపాడు. ఆర్మీ కంటోన్మెంట్ లో కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ తెగిపోయిందని, మరో ఇద్దరు మాత్రం తమతో మాట్లాడుతూనే ఉన్నారని అన్నాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.