: బట్టతల వారికి ఒక శుభవార్త...!


మీకు బట్టతల ఉందా... అయితే మీకు ఈ వార్త తెలియాల్సిందే. ఎందుకంటే మీ తలపైన వెంట్రుకలు పెరగడానికి ఉపకరించే ఒక సరికొత్త హెల్మెట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ హెల్మెట్‌ బట్టతలపై జుట్టును మొలిపించడమేకాదు... జుట్టు రాలే సమస్యను కూడా అరికడుతుందట. జుట్టు రాలేవారు మీ జుట్టు రాలకుండా కాపాడే ఈ సరికొత్త హెల్మెట్‌ను పెట్టుకుంటే... మీ జుట్టు రాలే సమస్యను అధిగమించడంతోబాటు మీ వెంట్రుకలు కూడా చక్కగా పొడవుగా పెరుగుతాయి. ఇలా జుట్టు పొడవును పెంచే సామర్ధ్యంతో కూడిన ఒక సరికొత్త హెల్మెట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

బ్రిటన్‌లో శాస్త్రవేత్తలు ఒక లేజర్‌ హెల్మెట్‌ను తయారుచేసి ఉపయోగించడం ప్రారంభించారు. ఈ హెల్మెట్‌తో వెంట్రుకలు రాలడాన్ని తగ్గించవచ్చని దీని తయారీదారులు చెబుతున్నారు. ఐగ్రో హెయిర్‌ గ్రోత్‌ సిస్టమ్‌ అనే ఈ లేజర్‌ హెల్మెట్‌ 35 నుండి 40 శాతం దాకా వెంట్రుకలు వృద్ధి కావడానికి తోడ్పడుతుందని, వెంట్రుకల కుదుళ్ల పరిమాణాన్ని రెట్టింపు చేస్తూ, వెంట్రుకలు రాలే వేగాన్ని తగ్గిస్తుందని దీనిపై నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో తేలింది. ఈ హెల్మెట్‌లో తక్కువ మోతాదు శక్తిగల 51 ఎర్ర లేజర్లు, ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. దీనిని స్వల్ప స్థాయి లేజర్‌ చికిత్స అని పిలుస్తున్నారు. ఈ చికిత్స సమయంలో ఈ హెల్మెట్‌ను 25 నిముషాలపాటు తలకు ధరించాల్సి ఉంటుంది. అప్పుడు ఇందులోని లేజర్‌ కిరణాలు వెంట్రుకల కుదుళ్లలోని కణాలను పునరుత్తేజితం చేస్తాయి. దీని ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అలాంటివారికి ఇది బాగా పనికొస్తుందని దీని తయారీదారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News