: ముఫ్ఫైరోజులైనా మరణ సమయాన్ని తెలుసుకోవచ్చు


మనం మరణించిన సమయాన్ని కచ్చితంగా చెప్పగలిగే సూక్ష్మ జీవగడియారం మన శరీరంలోనే ఉంటుందట. దీని ఆధారంగా మనిషి ఎప్పుడు మరణించాడు, ఏ సమయంలో మరణించాడు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరం కోట్ల సూక్ష్మక్రిముల నిలయం. ఇందులో మనకు మేలుచేసేవి కొన్నివుంటే, మరికొన్ని మనకు హాని కలిగించేవి ఉంటాయి. అయితే ఇదే సూక్ష్మ క్రిములు మనం మరణించిన సమయాన్ని కచ్చితంగా చెప్పగలవట. సాధారణంగా మనిషి మరణించిన తర్వాత శరీరం కుళ్లిపోవడం మొదలవుతుంది. ఈ సమయంలో శరీరంలోని బాక్టీరియాలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మక్రిమి గడియారంగా భావించే దీని ఆధారంగా మనిషి చనిపోయిన సమయాన్ని గుర్తించవచ్చని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

కొలరాడో బౌల్డర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జెస్సికా మెట్‌కాఫ్‌ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో మనిషి మరణించిన తర్వాత శరీరంలోని సూక్ష్మక్రిమి గడియారం ఆధారంగా మరణించిన సమయాన్ని తెలుసుకోవచ్చని తేలింది. కొన్ని మరణాలకు సంబంధించిన కేసుల్లో సదరు వ్యక్తి మరణించిన సమయాన్ని తెలుసుకోవడం చాలా కీలకమని, దీని కచ్చితంగా నిర్ధారించడానికి ప్రస్తుతం ఆధారపడుతున్న పద్ధతులు కచ్చితంగా లేవని మెట్‌కాఫ్‌ తెలిపారు.

తమ అధ్యయనంలో భాగంగా తాము అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలుకల మృతదేహాల్లోని సూక్ష్మక్రిముల జన్యువుల క్రమాన్ని క్షుణ్ణంగా విశ్లేషించామని, ఎలుకలు చనిపోయిన 48 గంటల తర్వాత కూడా నాలుగు రోజులు అటుఇటుగా మరణ సమయాన్ని సరిగ్గా గుర్తించగలిగామని, అలాగే చనిపోయన 34 రోజుల తర్వాత ఈ సమయాన్ని మరింత కచ్చితంగా చెప్పవచ్చని, మూడు రోజుల తర్వాతైతే మరింత కచ్చితంగా మరణ సమయాన్ని చెప్పవచ్చని మెట్‌కాఫ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News