: పాక్ లో యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష
పాకిస్థాన్ లో యాసిడ్ దాడికి పాల్పడిన ఫారూక్ షా అనే వ్యక్తికి ఆ దేశ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు నిందితుడు రూ.1.2 మిలియన్ల నష్టపరిహారాన్ని బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది. ఇరవై ఐదు సంవత్సరాల షా పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో ఆమె ప్రతిఘటించింది. ఆగ్రహించిన నిందితుడు బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాంతో, బాలిక ముఖం, మెడ పూర్తిగా కాలిపోయాయి. పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో ఏప్రిల్ నెలలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.