: ఆస్పత్రి నుంచి దిలీప్ కుమార్ డిశ్చార్జ్
బాలీవుడ్ అగ్ర నటుడు దిలీప్ కుమార్ (90) ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుండెపోటు కారణంగా ఈ నెల 15న ఆస్పత్రిలో చేరిన ఆయన పది రోజులపాటు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు కోలుకోవడంతో ఈరోజు వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.