: అక్టోబర్ 1 నుంచి తెలంగాణ జిల్లాల్లో టీడీపీ యాత్రలు
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్టోబర్ 1 నుంచి యాత్రలు నిర్వహించాలని టీడీపీ తెలంగాణ ఫోరం నిర్ణయించింది. ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అధ్యక్షతన టీడీపీ శాసనసభా పక్ష కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జిల్లా స్థాయిలోను, తరువాత నియోజకవర్గ స్థాయిలోను యాత్రలు, సదస్సులు నిర్వహించి... టీడీపీ ఆది నుంచీ తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలన్నీ ఒకటేనని చాటి చెబుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తామని టీ టీడీపీ నేతలు తెలిపారు.