: పాలమూరు 'ప్రజాగర్జన'కు సుష్మాస్వరాజ్
తెలంగాణలో పాతుకుపోయేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 28న మహబూబ్ నగర్ లో జరిగే పాలమూరు 'ప్రజాగర్జన' సభకు లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ప్రజల్లో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు తన నేతృత్వంలో మూడు ప్రాంతాల ప్రతినిధులతో కలిసిన బృందంతో వెళ్లి అధిష్ఠానాన్ని కలవనున్నామని ఆయన తెలిపారు.