: ఫుట్ బాల్ లీగ్ ను ప్రారంభించనున్న లలిత్ మోడీ


బీసీసీఐ జీవితకాల నిషేధం విధించినా లలిత్ మోడీ మాత్రం డీలా పడలేదు. పడి లేచిన కెరటంలా మరో ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యారు. ఐపీఎల్ తో ఇండియన్ క్రికెట్ కు కమర్షియల్, గ్లామర్ హంగులద్దిన మోడీ ఇప్పుడు మరో లీగ్ కు వ్యూహ రచన చేస్తున్నారు. త్వరలోనే 'ఇండియన్ ఫుట్ బాల్ లీగ్' ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్ తరహాలోనే ఫుట్ బాల్ లీగ్ లో కూడా ఫ్రాంచైజీలు ఉంటాయి. ఈ వివరాలను 'ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్' కు చెందిన ఒక కీలక వ్యక్తి వెల్లడించారు. ఇటీవలే మోడీ ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తో ఈ విషయం గురించి చర్చించారని తెలిపారు.

అయితే భారత్ లో తనకు ప్రాణ హాని ఉందని మోడీ గతంలో చాలా సార్లు చెప్పారు. దీనికి తోడు ఆయనకు ఇక్కడ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తో సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఈ లీగ్ ను ఇండియాకు వచ్చి ప్రారంభిస్తారా? లేదా లండన్ లోనే ఉండి చక్రం తిప్పుతారా? అనేది తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News