: దాడులకు భయపడేది లేదు: ప్రధాని
దాడులకు తాము భయపడబోమని, మరింత చిత్తశుద్ధితో దాడులను ఎదుర్కొంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదుల దాడిపై ఢిల్లీలో ఆయన మాట్లడుతూ.. ఇది శాంతి, చర్చలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. శాంతిని వ్యతిరేకించే శక్తులే దాడులకు పాల్పడ్డాయని అన్నారు. పొరుగు దేశం సహాయసహకారాలతోనే తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని, ఇలాంటి దాడుల వల్ల చర్చలకు విఘాతం కలగదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం సరిహద్దు దాటి జమ్మూ ప్రాంతంలోకి నలుగురు తీవ్రవాదులు చొరబడ్డారని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే.