: బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి
దేశంలో పన్నెండవ రాష్ట్రమైన బీహార్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. ఉత్తర భారతదేశ రాష్ట్రమైన బీహార్ జనాభా పరంగా మూడవ స్థానంలో ఉంది. దాంతో, అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్యానల్ గుర్తించింది. మరోవైపు బీహార్ కు ప్రత్యేక కేటగిరీ కల్పించాలంటూ కొన్నాళ్ల నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో, ఎన్నికలు ముందు కేంద్రం ఈ రాష్ట్రానికి ఆమోదం తెలిపింది. బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్తో పాటు ఇంకా ఏడు రాష్ట్రాలు దేశంలో తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఉన్నాయని రాజన్ ప్యానల్ రిపోర్ట్ చెబుతోంది. కాగా, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందినవాటిగా పేర్కొంది.