: త్రిపురలో అధికార పార్టీ జయభేరి
త్రిపుర ఎన్నికల్లో అధికార సీపీఎం కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం మొత్తం 60 స్థానాలకు గాను 45 నెగ్గి సత్తా చాటింది. మిత్ర పక్షం సీపీఐ ఒక స్థానం దక్కించుకుంది.
కాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏడింటిలో నెగ్గి, మరో ఏడింటిలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ధన్ పూర్ నియోజక వర్గం నుంచి పోటీచేసిన త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ 6017 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. త్రిపురలో వామపక్షాలు అధికార పీఠాన్ని అధిష్టించడం ఇది వరుసగా ఐదోసారి.