: రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం: వెంకయ్య నాయుడు
వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీజేపీ సీనియర్ వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో దింపుతామని వెల్లడించారు. ఇక రాష్ట్ర విభజన అంశంపై వ్యాఖ్యానిస్తూ, తెలుగు ప్రజల అపోహలను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా, ఇటీవలే బీజేపీ అధినాయకత్వం టీడీపీకి స్నేహ హస్తం చాచిందన్న వార్తల నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి.