: నేరచరితులైన ప్రజాప్రతినిధులను తప్పించేందుకే ఆర్డినెన్స్: బీజేపీ


నేరచరిత్ర ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పదవులకు అర్హులు కారంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ పై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నిప్పులు చెరిగింది. నేరచరితులైన ప్రజాప్రతినిధులను అనర్హత వేటు నుంచి తప్పించేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఇది సమంజసం కాదని హైదరాబాదులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేరచరితులను రక్షించేందుకే ఆర్డినెన్స్ తెస్తున్నారని విమర్శించారు. కాగా, నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన బహిరంగ సభలో నరేంద్రమోడీ అద్వానీకి పాదాభివందనం చేసినా పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మోడీని దగ్గరకు తీసుకుని అద్వానీ ఆశీర్వదించారన్నారు. మోడీ ఎక్కడకు వెళ్లినా అనూహ్యమైన ప్రజాదరణ లభిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News