: అధిష్ఠానం మాతో ఆడుకుంటోంది.. మాకు మరో గత్యంతరం లేదు: సాయిప్రతాప్


కాంగ్రెస్ అధిష్ఠానం తమ రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఎంపీ సాయిప్రతాప్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో కూర్చున్న పెద్దలు తప్పుడు సమాచారం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. తాము ఎవరిని ఎన్నికల బరిలో నిలిపినా గెలుస్తారన్న గర్వంతో వారు ఉన్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీల పేర్లు చెప్పి ఓట్లు దండుకున్నామని, ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకుని ఓట్లు అడగాలని ఆయన ఆక్రోశించారు. స్వార్థ ప్రయోజనాలకోసమే విభజన నిర్ణయం తీసుకున్నారన్న విషయం ప్రజల్లో నాటుకుపోయిందని ఆయన తెలిపారు. ఇక ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని అందువల్లే రాజీనామాలు ఆమోదించుకోవడం మినహా తమకు గత్యంతరం లేదని సాయిప్రతాప్ తెలిపారు.

  • Loading...

More Telugu News