: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే: మొయిలీ
వైఎస్సార్సీపీతో పొత్తుపై కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ స్పందించారు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయాల్లో ఏదయినా సాధ్యమేనని తెలిపారు. దీంతో, టీడీపీ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. జగన్ కు బెయిల్ విషయంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.