: రూ.80 కోట్ల విలువైన నకిలీ స్టాంప్ పేపర్ల పట్టివేత


బీహార్ రాజధాని పాట్నాలో రూ. 80 కోట్ల విలువైన నకిలీ స్టాంప్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఏడుగురిని అరెస్టు చేశారు. పాట్నాలో మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి మను మహరాజ్ తెలిపారు. నకిలీ స్టాంప్ పేపర్లతో పాటు ప్రింటింగ్ మెషీన్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సీజ్ చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నకిలీ స్టాంప్ పేపర్లలో రూ. 1000, రూ. 500 విలువైనవి ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ స్టాంప్ పేపర్లను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నంలో ఈ ముఠా ఉన్నట్టు మహరాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News