: ఫిలిప్పీన్స్ లో భారతీయుడి కాల్చివేత
ఫిలిప్పీన్స్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా మరో భారతీయుడు సురక్షితంగా బయటపడ్డాడు. జస్వీందర్ సింగ్(38) అనే వ్యక్తి బటాక్ నగరంలో నివాసముంటున్నాడు. తన సమీప బంధువు అమరీందర్ సింగ్ తో కలిసి ఇలోకస్ నగరానికి కారులో బయల్దేరాడు. రహదారిపై వెళుతుండగా మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగుడు జస్వీందర్ పై కాల్పులకు తెగబడ్డాడు. జస్వీందర్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతను మృత్యువాతపడ్డాడు. అమరీందర్ మాత్రం సురక్షితంగా తప్పించుకున్నాడు.