: జగన్ కు సీబీఐ కోర్టు సమన్లు
బెయిల్ పై నిన్ననే విడుదలైన కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ప్రశ్నించేందుకు నవంబర్ 1న హాజరుకావాలని ఆదేశించింది. అటు, అదే రోజు తమ ఎదుట హాజరుకావాలని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కూ సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఛార్జి షీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తాజా సమన్లు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో ఐఏఎస్ లు ఆదిత్యనాథ్ దాస్, శామ్యూల్ కూ సమన్లు పంపింది. వీరితో పాటు ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా అదే తేదీన హాజరు కావాలని పీటీ వారెంట్ ఇచ్చింది.