: భారత ఖైదీలకు స్వేచ్ఛ ప్రసాదించిన పాక్


ఏళ్ల తరబడి పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న10 మంది భారత ఖైదీలకు నేడు విముక్తి లభించింది. వారిని విడుదల చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో  ఏడుగురు మత్స్యకారులు కాగా, మరో ముగ్గురు ఇతరులు. విడుదలైన వారిని శుక్రవారం భారత్-పాక్ సరిహద్దు వాఘా వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు.

ఇంకా 100 మందికి పైగా మత్స్యకారులు పాకిస్తాన్ లోని కరాచీ, ఇతర జైళ్లలో అష్టకష్టాలు పడుతున్నారని అక్కడి మానవ హక్కుల సంఘాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ లో మానవ హక్కుల పోరాటంలో ముందుండే అన్సార్ బర్నీఇంటర్నేషనల్ ట్రస్ట్ చొరవ కారణంగానే భారత ఖైదీలకు స్వేచ్ఛ లభించింది. భారత్ ఖైదీలను విడుదల చేయాలని ఈ ట్రస్టు పాకిస్తాన్ వ్యాప్తంగా ఓ ఉద్యమం చేపట్టింది. 

  • Loading...

More Telugu News