: పాక్ ప్రధానితో భేటీకి ఇది సమయమా?: యశ్వంత్ సిన్హా


పాకిస్థాన్ తో చర్చలు జరపడానికి ఇది సరైన సమయమా? అని ప్రధాని మన్మోహన్ ను బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. లేకపోతే, చర్చలు జరపడానికి అనుకూల వాతావరణం ఏమైనా నెలకొందా? అని విమర్శించారు. అమెరికా పర్యటనలో పాక్ ప్రధానితో చర్చలు జరుపుతామని ప్రధాని మన్మోహన్ తెలపడంతో... సిన్హా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఒక టెలివిజన్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 2004 నుంచి సరిహద్దుల్లో పాక్ ఉద్రిక్తతలను రెచ్చగొడుతూనే ఉందని, ముంబైపై ఉగ్రదాడి చేయించిందని తెలిపారు. ఇటీవల కాలంలో జమ్ముకాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వద్ద పాక్ సైన్యం చేస్తున్న దురాగతాలను ప్రధాని మరచిపోయారా? అని విమర్శించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు చేపట్టరాదని సూచించారు. తీవ్రవాదం, చర్చలు కలసి ప్రస్థానం సాగించరాదన్నది బీజేపీ సిద్ధాంతమని సిన్హా తెలిపారు.

  • Loading...

More Telugu News