: తమిళ జాలర్ల విడుదలకు శ్రీలంక కోర్టు ఆదేశాలు
తమిళనాడుకు చెందిన 41 మంది మత్స్యకారుల విడుదలకు శ్రీలంక కోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు జూలై 5 న 21 మంది, ఆగస్టు 5 న మరో 20 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీలంక న్యాయ స్థానం జాలర్ల విడుదలకు ఆదేశాలిస్తూ, వారి పడవలను మాత్రం వదిలేది లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, ఆమధ్య ఇలాగే అరెస్టయి విడుదలైన 35 మంది జాలర్లు కూడా ఇండియాకు తిరిగి వచ్చేందుకు మార్గం లేక ఇంకా శ్రీలంకలోనే ఉన్నారు.