: ప్రముఖ అథ్లెటిక్ కోచ్ ఏకే కుట్టి మృతి
ప్రముఖ అథ్లెటిక్ కోచ్ ఏకే కుట్టి (75) కేరళలోని పాలక్కడ్ లో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందువల్లే ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుట్టి మృతికి కేరళ సీఎం ఊమెన్ చాందీ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలు రేపు (గురువారం) జరగనున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగిగా సేవలందించిన కుట్టి పదవీ విరమణ అనంతరం కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ లో శిక్షకుడిగా చేరారు. ఈ సమయంలో అథ్లెటిక్ క్రీడాకారిణి మెర్సీ కుట్టన్ వంటి సమర్థవంతమైన క్రీడాకారులను తయారుచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కుట్టిని ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది.