: దోషులను రక్షించే ఆర్డినెన్స్ వద్దు: బీజేపీ
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలన్న సుప్రీం ఉత్తర్వులను తిరస్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని బీజేపీ విమర్శించింది. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. దోషులుగా తేలిన ఎంపీలను రక్షించేందుకు కేంద్ర కేబినెట్ రూపొందించిన ఆర్డినెన్స్ పై సంతకం చేయవద్దని రాష్ట్రపతికి విన్నవిస్తాం అని సుష్మా ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి మనీష్ తివారీ స్పందిస్తూ.. రాజ్యాంగపరమైన లేదా న్యాయపరమైన అంశాలను రాజ్యాంగ పరిధిలో నిర్ణయిస్తారు తప్ప బీజేపీ కోరుకున్నట్టు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.