: జగన్ తో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం భేటీ
దాదాపు 16 నెలల తర్వాత బెయిల్ పై విడుదలైన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం భేటీ అయింది. రాష్ట్ర విభజనకు నిరసనగా చేస్తున్న సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే విభజన ప్రకటనకు నిరసనగా ఎంపీ పదవికి రాజీనామా చేసి యూటర్న్ తీసుకున్న జగన్ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.