: ఆర్ధిక నేరస్తుడికి ఐదుగంటల పాటు ఊరేగింపా?: సీపీఐ


బెయిల్ పై బయటికొచ్చిన జగన్ తన నివాసానికి చేరుకునే క్రమంలో సుదీర్ఘ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఒక ఆర్ధిక నేరస్తుడిని ఐదు గంటలపాటు ఊరేగింపుగా తీసుకురావడానికి పోలీసులు సహకరించడంపై ఆ పార్టీ నేత రామకృష్ణ మండిపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కు ఫలితమే పోలీసులు జగన్ ర్యాలీకి కొమ్ముకాశారని ఆరోపించారు. అవినీతి కేసులో బెయిల్ పై విడుదలైన వ్యక్తి జైత్రయాత్ర జరుపుకోవడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, బెయిల్ మాత్రమే మంజూరు చేసిందని అన్నారు. రాహుల్ ను ప్రధాని చేయడం కోసమే సోనియా జగన్ లాంటి ఆర్ధిక నేరస్తుడిని విడుదల చేసిందని రామకృష్ణ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News