: కెన్యాలో ఉగ్రవాదుల ఏరివేత
కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజధాని నైరోబీలోని వెస్ట్ గేట్ మాల్ లో దాడులకు పాల్పడిన వీరిని అంతమొందించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఉహురూ కెన్యట్టా ప్రకటించారు. కాగా, ఈ దాడిలో 67 మంది మృతి చెందారని, వారిలో ముగ్గరు భారతీయులు ఉన్నారని చెప్పారు. ఈ దాడిలో పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.