: బయోటెక్ రంగాన్ని చిన్నచూపు చూశారు: భారత పరిశ్రమల సమాఖ్య
ఆర్థిక మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్ లో బయోటెక్ రంగాన్ని చిన్న చూపు చూశారని భారత పరిశ్రమల సమాఖ్య అభిప్రాయపడింది. పరిశోధన, అభివృద్ధి రంగాలకు సముచిత స్థానం కల్పిస్తే బాగుండేదని సమాఖ్య వర్గాలు అన్నాయి. స్థూలంగా చూస్తే బడ్జెట్ బాగానే ఉన్నట్టు కనిపిస్తోందంటూ, అన్ని వర్గాలను చిదంబరం ఏదో రకంగా సంతృప్తి పరిచినట్టే ఉందని పరిశ్రమల సమాఖ్య అభిప్రాయం వ్యక్తం చేసింది.