: ఇవి మరింత స్మార్ట్‌!


ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు మిలమిలలాడుతున్నాయి. ఈ ఫోన్‌లు ఎంత నాజూకైనవో... వాటిపట్ల అంతే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం చేజారి కిందపడినా... ఇక ఆ ఫోన్‌పై ఆశ వదులుకోవాల్సిందే... అంతటి నాజూకైనవి. అలాంటి నాజూకైన ఫోన్‌ల స్థానంలో పగలకుండా ఉండే ఫోన్‌లను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నీటిలో పడినా కూడా ఏమాత్రం పాడవకుండా ఉండేలా ఫోన్‌లను తయారుచేశారు. ఇప్పుడు కిందపడ్డా కూడా చెడిపోకుండా ఉండే ఫోన్‌లను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పొరబాటున మన చేతిలో నుండి జారి కిందపడినా కూడా ఏమాత్రం దెబ్బతినని స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. రాయల్‌ మెల్‌బెర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కిందపడినా కూడా పగలకుండా ఉండేలా స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు వెలువడుతున్నట్టు ప్రకటించారు. ఈ పరిశోధనల్లో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ మధు భాస్కరన్‌ కూడా ఉన్నారు. ఈ ఫోన్‌లు మార్కెట్లోకి వస్తే అప్పుడు అందరికీ ప్రియమైనవవుతాయి.

  • Loading...

More Telugu News