: 'అత్తారింటికి దారేది' పైరసీ సూత్రధారుల గుట్టు రట్టు
'అత్తారింటికి దారేది' పైరసీ సూత్రధారుల గుట్టు రట్టయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఆఫీసులో పనిచేసే ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ ను దీనికి సూత్రధారిగా గుర్తించారు. అరుణ్ కుమార్ ఏపీఎస్పీలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు డీవీడీ ఇచ్చాడు. తరువాత కానిస్టేబుల్ ద్వారా డీవీడీ కృష్ణా జిల్లా పెడనకు చేరినట్టు గుర్తించారు. నిందితుడిని పోలీసులు బందరు తరలిస్తున్నారు.