: లోటస్ పాండ్ లో తన నివాసానికి చేరుకున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో తన నివాసానికి చేరుకున్నారు. జగన్ ఇంటి వద్దకు చేరుకోగానే కుటుంబసభ్యులు హారతిచ్చి స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నేతలు జగన్ కు ఇంటి వద్ద స్వాగతం పలికారు. లోటస్ పాండ్ జై జగన్ నినాదాలతో మారుమోగిపోతోంది. జైలు నుంచి ఇంటికి జగన్ కాన్వాయ్ చేరుకోవడానికి సుమారు 5గంటల 30నిమిషాల సమయం పట్టింది. 485 రోజుల తరువాత జైలు నుంచి జగన్ ఇంటికి చేరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న అభిమానులకు జగన్ అభివాదం చేశారు.