: సమ్మె యోచన విరమించుకున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో సమ్మెకు సిద్ధమైన బ్యాంకుల ఉద్యోగులు సమ్మె యోచన విరమించుకున్నారు. విలీనం చేసే ఆలోచనేదీలేదని కేంద్రం స్పష్టం చేయడంతో వారు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఢిల్లీలో ప్రధాన లేబర్ కమిషనర్ కార్యాలయంలో కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల సంఘం నేతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు.