: డీజిల్ ధర పెంచే యోచన లేదు: మొయిలీ


ఇప్పట్లో డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదనేదీ కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ చేయట్లేదని మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నెలకు లీటరు డీజిల్ పై 40 పైసల నుంచి 50 పైసలు పెంచాలనే యోచన లేదని అన్నారు. గత ఆరు నెలల్లో 9 సార్లు ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ధరలను పెంచే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గడంతో ఇంధన ధరలు తగ్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.

  • Loading...

More Telugu News