: మరో ముప్పు ముంగిట్లో కేదార్ నాథ్
వరద విలయానికి కకావికలమైన ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ పుణ్యక్షేత్రానికి మరో ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలకు మందాకిని, సరస్వతీ నదులు పొంగి ప్రవహిస్తుండగా, ఆలయం వెనుక ఉన్న చోరీబారీ హిమనీనదం కూడా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మరోసారి వరద ముప్పు పొంచి ఉండడంతో ఆలయ పూజారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.