: 'వందేళ్ల సినిమా' ముగింపు వేడుకలు ప్రారంభం
'వందేళ్ల భారతీయ సినిమా' ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు రోజులుగా చెన్నైలో జరుగుతున్న వేడుకలు నేటితో ముగియనున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మల్లూవుడ్, భోజ్ పురి, బెంగాలీ, ఒడియా, మరాఠీ, పంజాబీ భాషలకు చెందిన పలువురు నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వేడుకలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ముగింపు వేడుకల్లో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, రేఖ పాల్గొన్నారు.