: జగన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిన సీబీఐ కోర్టు
సీబీఐ కోర్టు జగన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. పూచీకత్తు పత్రాలు పరిశీలించిన మీదట న్యాయమూర్తి చంచల్ గూడ జైలు అధికారులకు ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. దీంతో మరికాసేపట్లో జైలు నుంచి జగన్ వెలుపలికి వచ్చే అవకాశముంది.