: సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం.. నిలిచిన ఉత్పత్తి
విశాఖ సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. లోపాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. తొందర్లోనే సమస్య పరిష్కరించి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.