: నెల్లూరులోని ఆసుపత్రిలో బాంబు కలకలం
నెల్లూరులోని రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో బాంబు కలకలం రేగింది. ఆసుపత్రిలో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం జిల్లా ఎస్పీ రామకృష్ణకు సమాచారమందించడంతో ఆయన హుటాహుటిన తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, పోలీసులు, సాయుధ బలగాలు అప్రమత్తమై ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.