: మరో అధికారి ఎలా అఫిడవిట్ దాఖలు చేస్తారు?: రేవంత్ రెడ్డి


కేసు విచారణ చేసిన అధికారి కాకుండా మరో అధికారి అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తారని జగన్ బెయిల్ పిటిషన్ విచారణపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతూ, రూ.12 వందల కోట్ల అక్రమాలు జరిగాయని పది చార్జిషీట్లలో సీబీఐ చెప్పిందని.. అలాంటిది బెయిల్ పిటిషన్ పై కొత్త అధికారి ఎలా అఫిడవిట్ దాఖలు చేశారని మండిపడ్డారు. జగన్ బెయిల్ పిటిషన్ పై సీబీఐ ఎందుకు వాదనలు వినిపించలేదని ఆయన అడిగారు. విచారణాధికారులను బదిలీ చేయబోమంటూనే వెంకటేశ్ ను ఎలా మార్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లంచం ఇచ్చిన నిమ్మగడ్డ బెయిల్ ను అడ్డుకున్న సీబీఐ.. లంచం తీసుకున్న జగన్ కు ఎలా సహకరించిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News