: ఎంపీలతో బొత్స భేటీ


నిన్నటి నుంచి ఎంపీలతో భేటీ అవుతున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స మరోసారి వారితో భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వీరి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీమాంధ్రకు చెందిన 8 మంది ఎంపీలు హాజరయ్యారు. రాజీనామాలు ఆమోదింపజేసుకోవడంలో స్పీకర్ పై ఒత్తిడి తీసుకురావద్దని బొత్స వారికి నచ్చజెపుతున్నారు. అందరూ పదవిలోనే కొనసాగుతూ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. అంతగా అవసరమైతే, అందరం కలిసే రాజీనామాలు చేద్దామని ఎంపీలకు చెప్పారు.

బొత్సతో పాటు సీఎం కిరణ్ కూడా ఇదే విధంగా సూచిస్తుండటంతో కొంత మంది ఎంపీలు రాజీనామాలపై మెత్తబడినట్టు సమాచారం. అయితే విజయవాడ ఎంపీ లగడపాటి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం ఇంకా బెట్టుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన స్పీకర్ మీరా కుమార్ హఠాత్తుగా పాట్నా పర్యటనకు వెళ్లడంతో... స్పీకర్ తో వీరి సమావేశం ఈ నెల 30కి వాయిదాపడింది. ఈ లోగా రాజీనామాలపై ఎంపీల పట్టును సడలింపజేసేందుకు బొత్స ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News