: రాష్ట్ర విభజనకు నిరసనగా నేడు సీమాంధ్ర బంద్
రాష్ట్ర విభజనకు నిరసనగా నేడు సీమాంధ్ర జిల్లాల్లో బంద్ పాటిస్తున్నారు. ఈ నెల 16న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా సీమాంధ్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను సరిహద్దుల్లో నిలిపివేయనున్నట్టు తెలిపారు. తిరుపతిలో ఆటోలు, ట్యాక్సీలను ఎన్జీవోలు అడ్డుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల వెళ్ళే బస్సులను సమైక్యవాదులు నిలిపివేశారు. అలిపిరి వద్ద ప్రైవేటు బస్సులను అడ్డుకున్నారు.