: మెదడుతో యంత్రాన్ని కంట్రోలు చేయొచ్చు!


మనిషి మెదడుతో ఏదైనా సాధించగలడు. మెదడుకున్న ఆలోచనా సామర్ధ్యం అద్భుతమైంది. అందుకే భూమిపైని జీవరాసులలో మనిషి ఉన్నతుడిగా నిలిచాడు. ఇప్పుడు అదే మెదడుతో యంత్రాలతో కూడా పనిచేయించవచ్చని నిరూపిస్తున్నాడు. మనం ఆలోచిస్తే... దాన్ని అనుసరించి కంప్యూటర్లు, ఇతర పరికరాలు పనిచేసేవిధంగా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృధ్ది చేశారు.

మన మెదడులోని కొన్ని చర్యలను సంకేతాలుగా మార్చి, వాటిని కంప్యూటరు లేదా ఇతర పరికరాలకు చేర్చి, మన ఆలోచనలకు అనుగుణంగా అవి కదిలేలా ఒక సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వర్జీనియా టెక్‌ కరిలియాన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న స్టీఫెన్‌ లకోంటే నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధానం వల్ల మనిషి మెదడుకు కంప్యూటరుకు అనుసంధాన పనితీరును మరింత మెరుగుపరచవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News