: భార్యపై అత్యాచారం... శాస్త్రవేత్తపై కేసు
అనుమతి లేకుండా భార్యను ముట్టుకున్నా అత్యాచారమే అవుతుందన్న విషయం ఆయనకు తెలియదేమో పాపం... ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో) లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న తపస్ కుమార్ భార్యను అత్యాచారం చేశాడన్న కేసులో కోర్టు బోను ఎక్కనున్నాడు. ప్రస్తుతం తపస్ ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... 2011లో తమకు పెళ్లి జరిగే సమయానికే తన భర్తకు మరో మహిళతో వివాహం జరిగిందని తపస్ కుమార్ భార్య తెలిపింది. ఆమెకు విడాకులిచ్చానని అబద్దం చెప్పాడని, కానీ విడాకులు తీసుకోలేదన్న విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పింది. దీంతో తపస్ పై రాయ్ పూర్ పోలీసులు ఐపీసీ 76 (అత్యాచారం), 419 (మోసగించడం), 496 (మోసగించి పెళ్లి చేసుకోవడం), 498 ఎ (భార్యను హింసించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.