: మహిళా ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్పై సస్పెన్షన్ ఎత్తివేత


మహిళా ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్పై విధించిన సస్పెన్షన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దుర్గాశక్తి నాగ్‌పాల్పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నామని, ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని ఒకే వాక్యంతో అఖిలేష్ యాదవ్ సర్కారు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న తన భర్తతో పాటు ఆమె నిన్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తన సస్పెన్షన్‌కు కారణమైన సంఘటన గురించి వివరణ ఇచ్చారు. జూలై 27న యూపీ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇసుక మాఫియా ఒత్తిడులకు తలొగ్గి యూపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు యూపీ ప్రభుత్వ చర్యను గర్హించారు. దేశవ్యాప్తంగా సాగిన ఈ దాడితో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరయింది.

  • Loading...

More Telugu News