: తెలంగాణను అడ్డుకునేందుకే బాబు జాతీయ నేతలను కలుస్తున్నారు: జూపల్లి కృష్ణారావు
తెలంగాణను అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నేతలను కలుస్తున్నారని టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలను చీలుస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజాయతీ లేదన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు మాని పరిష్కారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.