: రౌడీ ఎస్పీ సస్పెన్షన్
యూపీలో సహచర క్రింది స్థాయి సిబ్బందిపై దాడికి పాల్పడిన మొరాదాబాద్ సీనియర్ ఎస్పీ రాజేష్ మోదక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన నివాసం వద్ద విధులు నిర్వర్తించే ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆయన కొట్టారు. ఎస్పీ తమను అకారణంగా మేన్ హ్యండ్లింగ్ చేశారంటూ వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు రాజేష్ పై సస్పెన్స్ వేటు వేశారు.