: టీడీపీని బలహీన పర్చడానికే విభజన తెచ్చారు: బాబు


టీడీపీని ఎదుర్కొనే శక్తి లేక ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసి లబ్ది పొందాలని కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాష్ట్ర విభజన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు విమర్శించారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన సందర్భంగా పలువురు ముఖ్య నేతలను కలిసిన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ వైఖరి వల్ల రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇప్పటికైనా ఇరు ప్రాంత ప్రజాసంఘాలు, వాణిజ్య, వర్తక, వ్యవసాయ సంఘాలతో చర్చలు జరపండి, సమస్యను పరిష్కరించండి' అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

కేవలం రాజకీయ లబ్దిని దృష్టిలో ఉంచుకుని చేసే విభజన తప్పని, దేశాన్ని అస్థిరపరుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పై ఒత్తిడి తేవాలని జాతీయ పార్టీలను కోరామని బాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. జగన్ డీఎన్ఏ కాంగ్రెస్ దే అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

విభజన నిర్ణయం ప్రకటనతోనే టీఆర్ఎస్ విలీనమౌతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారం సొంత పార్టీ వ్యవహారం కాదని ఆయన స్పష్టం చేశారు. 56 రోజులుగా సీమాంధ్రలో అనిశ్చితి నెలకొంటే కేంద్రం కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. అసలు ప్రజలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

సున్నిత అంశంపై కలుగజేసుకోవాలని రాష్ట్రపతిని కోరామన్నారు. అప్పట్లో ప్రజల నాడి తెలుసుకోలేక రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చాయని, ఇప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎంత విమర్శిస్తే అంత బలపడుతుందనడం సిగ్గు చేటని అన్నారు. టీడీపీ బలీయమైన శక్తిగా రూపొందడంతోనే కాంగ్రెస్ విభజనకు పూనుకుందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News