: ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడ్ని కడతేర్చిన భార్య
అక్రమసంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో లాల్జీయాదవ్, కవిత భార్యాభర్తలు. విశ్వనాథ్ అనే మరో వ్యక్తితో కవితకు అక్రమ సంబంధం ఉంది. విషయం తెలిసిన లాల్జీయాదవ్ భార్యను మందలించాడు. తమ అనుబంధానికి అడ్డు వస్తున్న భర్తను తొలగించుకునేందుకు పథకంవేసి మరో వ్యక్తి సాయంతో అతడ్ని హత్య చేసింది. పొదల్లో పడి ఉన్న యాదవ్ మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.