: ఏసీ నుంచి అపార్ట్ మెంటుకు అంటుకున్న మంటలు
చెన్నైలో ఓర్మ్స్ రోడ్ లోని కీల్ పాక్ అపార్ట్ మెంటులోని ఐదో అంతస్థులో పనిచేయని ఏసీ నుంచి మంటలు చెలరేగి అపార్టుమెంటుకు అంటుకున్నాయి. ఈ మంటలు ఆరు, ఏడు అంతస్థులకు వ్యాపించి ఉగ్రరూపం దాల్చడంతో అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో అపార్ట్ మెంటులో నివసిస్తున్న వారంతా అప్రమత్తమై ప్రమాదం నుంచి ముందుగానే తప్పించుకోగలిగారు.